గుండె ఆగినంత పని.. అయినా, టెస్టులు చేస్తున్నా..

by  |
గుండె ఆగినంత పని.. అయినా, టెస్టులు చేస్తున్నా..
X

దిశ, ఆదిలాబాద్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఇది మరింత తీవ్రతరం కాకుండా తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ యోధుల్లా వైద్యులతోపాటు తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టి సాగుతున్నారు ల్యాబ్ టెక్నీషియన్లు. కరోనా కదనరంగంలో రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. అనుమానితుల నుంచి స్వాబ్, రక్త నమూనాలు సేకరిస్తున్న ప్రతి లాబ్ టెక్నీషియన్ ఆదర్శప్రాయులు. భారత్ సహా ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతుంటే కరోనా వైరస్‌ను గుర్తించే ల్యాబ్ టెక్నీషియన్‌ల మానసిక పరిస్థితి ఎలా ఉందో
తెలుసుకునేందుకు ‘దిశ’ ఓ ల్యాబ్ టెక్నీషియన్‌ను పలుకరించింది.

6 నుంచి 8 గంటల పని..

ల్యాబ్‌లో టెస్ట్ చేస్తున్నపుడు..ఒక కేసు పాజిటివ్ వచ్చిందంటే చాలు ‘‘గుండె ఆగినంత పని’’ అవుతుందనీ, అయినా మొండి ధైర్యంతో 6 నుంచి 8 గంటలపాటు టెస్టులు చేస్తూనే ఉంటున్నామన్నారు. అయితే, డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్లేటపుడు మళ్లీ భయం మొదలవుతోందంటున్నారు. ఎందుకంటే
ఇంటికి వెళ్లిన తర్వాత ఇంట్లో ఉన్న 70 ఏళ్ల నాన్న, 65 ఏళ్ల అమ్మ‌లను చూసుకోవాలనీ, తన నా ద్వారా ఇంటికి వైరస్ రాకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ, ఇక దేవుని దయ అని చెబుతున్నారు. వైద్యుల కన్నా ముందు కరోనా అనుమానితులతో ఫస్ట్ ఇంటరాక్ట్ అయ్యేది తామేననీ, వైరస్ ఉన్నట్టు తేలిన తర్వాతనే వాళ్లను డాక్టర్లు చూస్తారని వివరిస్తున్నారు. కొవిడ్ పేషెంటు వచ్చిన వెంటనే పరీక్షించాలనీ, హాస్పిటల్‌లో పాజిటివ్‌గా చేరితే ఉన్నన్ని రోజులు పరీక్ష‌లు చేయాల్సిన పరిస్థితి తమది అంటూ ఓ పేరు చెప్పడానికి ఇష్టపడని టెక్నీషియన్ చెప్పారు. ఈ కష్ట కాలంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో తెర వెనుక ఉండి, ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లోని లాబ్ టెక్నీషియన్‌లందరూ ఇప్పుడు కనిపించే దేవుళ్లే..!

Tags: corona virus, covid 19 suspects, tests, lab technicians, treatment, lock down, god

Next Story

Most Viewed