బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్‌ ఫిదా.. అసలేం జరిగిందంటే ?

by  |
ktr
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు కుటుంబానికి ఆసరా నిలుస్తున్నాడు. ఉదయం సైకిల్ పై ఇంటింటికి పేపర్ వేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. ఆ విద్యార్థి పేపర్ వేస్తుండగా ఓ వ్యక్తి అతడిని పలుకరించాడు. ఈ వయసులో పేపర్ ఎలా వేస్తావ్ అని అడగ్గా.. చదువుకుంటూ పేపర్ వేస్తే తప్పేంటని సదరు విద్యార్థి సమాధానం ఇచ్చాడు. వివరాలలోకి వెళ్తే.. జగిత్యాలకు చెందిన జయప్రకాశ్ అనే విద్యార్థి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. మరో వైపు ఉదయం పేపర్ బాయ్ గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం ఇంటింటికీ పేపర్ వేస్తున్న జయప్రకాశ్ ను దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి పలుకరించాడు.

ఏం చేస్తున్నావ్‌.. ఎక్కడ చదువుతున్నావ్‌ అని ప్రశ్నించాడు. అనంతరం సదరు వ్యక్తి ఈ ఏజ్‌లో నువ్వు పేపర్‌ వేస్తున్నావ్‌ ఎందుకు అని ప్రశ్నించగా.. అప్పుడు జయ ప్రకాశ్‌ ‘ఏం.. పేపర్‌ వేయొద్దా’ అని తిరిగి ప్రశ్నిస్తాడు. సంబంధిత వీడియోను మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశాడు. ఆ వీడియోను చూసి విద్యార్థి ఆత్మవిశ్వాసానికి కేటీఆర్‌ ఫిదా అయ్యాడు. విద్యార్థిని అభింనందించారు. విద్యార్థి ఆత్మవిశ్వాసం, ప్రశాంతత, ఆలోచనల్లో స్పష్టత మరియు వ్యక్తీకరణ తనకు నచ్చిందని పేర్కొన్నారు. జయ ప్రకాష్ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

Next Story