- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రాన్స్‌లో బిజీబిజీగా కేటీఆర్.. కీలక ప్రాజెక్టులపై చర్చ
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం శుక్రవారం పలు కంపెనీల సీఈవోలు, అధిపతులతో సమావేశమైంది. అందులో భాగంగా మూవ్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ డిప్యూటీ సీఈవో జెరాల్డిన్ లెమ్లేతో సమావేశమయ్యారు. తెలంగాణలో తయారీ రంగం అవకాశాలను, సహకార అవకాశాలను వివరించారు. తెలంగాణలో ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో సాధించిన విజయాలను వారికి తెలిపారు. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అనేక అవకాశాలను అందుబాటులోకి […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం శుక్రవారం పలు కంపెనీల సీఈవోలు, అధిపతులతో సమావేశమైంది. అందులో భాగంగా మూవ్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ డిప్యూటీ సీఈవో జెరాల్డిన్ లెమ్లేతో సమావేశమయ్యారు. తెలంగాణలో తయారీ రంగం అవకాశాలను, సహకార అవకాశాలను వివరించారు.
తెలంగాణలో ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో సాధించిన విజయాలను వారికి తెలిపారు. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అనేక అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అనంతరం ప్యారిస్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్‌లో (Station F Is The World’s Biggest Startup Incubator) మంత్రి కేటీఆర్ పర్యటించారు.
ఈ సందర్భంగా స్టేషన్ ఎఫ్ బృందంతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన THub, WeHub,TWorks కు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఏరోస్పేస్ & డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పాల్గొన్నారు.








