రైతులను చంపితే దేశభక్తులు.. విపక్షాలపై మంత్రి కేటీఆర్ మండిపాటు

by  |
ktr1
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమస్యలపై ధర్నా చేస్తున్న రైతులను చంపినవారు, కొవిడ్‌తో వీధిన పడిన కుటుంబాలను విస్మరించిన వారు దేశభక్తులా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వారికి సహాయం చేసిన వారు మాత్రం దేశ ద్రోహులా అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఉద్యమం చేస్తూ మృతి చెందిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.3 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఇక్కడి రైతులను పట్టించుకోవడం లేదు.. కానీ ఢిల్లీలో చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం అందజేస్తున్నారు’ అని మండిపడుతున్నారు. వారు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం తప్పా అని ప్రశ్నించారు. రైతులను విస్మరించిన వారు దేశభక్తులు అనడం విచిత్రమైన లాజిక్ ఇది అని మండిపడ్డారు. ఏది ఏమైనప్పటికీ దేశభక్తిపై ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి ఈ మూర్ఖులు ఎవరు? అని వ్యాఖ్యానించారు.

epaper – 1:00 PM TS EDITION (22-11-21) చదవండి


Next Story

Most Viewed