- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరు మట్టి పరిమళం గోరెటి : కేటీఆర్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రజాగాయకుడు, సాహితీ వేత్త గోరెటి వెంకన్న పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయనకు సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. అంతేగాకుండా ప్రభుత్వం ప్రజాకళాకారుడు గోరేటిని ఎంచుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ‘తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం, సాహితీ దిగ్గజం గోరెటి వెంకన్న గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రజాగాయకుడు, సాహితీ వేత్త గోరెటి వెంకన్న పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయనకు సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. అంతేగాకుండా ప్రభుత్వం ప్రజాకళాకారుడు గోరేటిని ఎంచుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ‘తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం, సాహితీ దిగ్గజం గోరెటి వెంకన్న గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం ఇది.’ అని కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Next Story






