కరోనా కట్టడికి మద్దతివ్వాలి : కేటీఆర్

by  |
కరోనా కట్టడికి మద్దతివ్వాలి : కేటీఆర్
X

దిశ, న్యూస్‌బ్యూరో :
కరోనా కట్టడి కోసం ఇన్నోవేటివ్ ప్రయత్నాలకు పెద్ద ఎత్తున మద్దతివ్వాలని దేశంలోని పలు కంపెనీలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. దేశంలోని పలు కంపెనీల యజమానులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా కొన్ని కంపెనీలు కలిసి సుమారు వంద కోట్ల రూపాయల యాక్ట్ గ్రాంట్స్( ACT GRANTS)ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో, కొవిడ్ – 19ను ఎదుర్కొనేందుకు ముందుకు రావాలని అన్నారు. కలారి క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వాణి కోలా బెంగళూరు నుంచి ఈ వీడియో సమావేశాన్ని నిర్వహించారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న మెడికల్ పరికరాలను స్థానికంగా తయారు చేసే పనిని పలువురు చేపట్టారని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే టీవర్క్స్ అతి తక్కువ ఖర్చుతో ఒక వెంటిలేటర్‌ను తయారు చేసిందని ఆయన వివరించారు.

కరోనా కట్టడి కోసం ముందుకు వచ్చే స్టార్టప్ కంపెనీలకు తమ ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని, ఇందుకోసం అవసరమయితే టీ హబ్, వీ-హబ్ , టీ వర్క్స్, రిచ్ (RICH), తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ వంటి సంస్ధల సహకారం తీసుకోవాలని సూచించారు. కరోనా కోసం వ్యాక్సిన్‌ను కనిపెట్టనున్న కంపెనీల వరుసలో ఐదు తెలంగాణ ప్రాంతం నుంచే ఉన్నాయన్నారు. కరోనాకు మందు కనిపెట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Tags: KTR, Corona control, video conferance, startups, Medical equipments

Next Story

Most Viewed