పోతిరెడ్డిపాడు‌పై స్పందించిన కృష్ణా బోర్డు

by  |
పోతిరెడ్డిపాడు‌పై స్పందించిన కృష్ణా బోర్డు
X

దిశ, న్యూస్‌బ్యూరో: పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) స్పందించింది. తెలంగాణ ఫిర్యాదుకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖను కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఏపీ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి శుక్రవారం ఒక లేఖ రాసింది. ఏపీ రీ-ఆర్గనైజేషన్ చట్టం 2014 ప్రకారం కృష్ణా నదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాల్సి ఉంటుందని తెలిపింది. శ్రీశైలం ప్రాజెక్టు సంగమేశ్వరం వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం జనవరిలోనే లేఖ రాసిందని, దీనికి స్పందిస్తూ తాము సంబంధిత ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాలని కోరినా ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన లేదన్న విషయాన్ని కేఆర్ఎంబీ ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్‌కు గుర్తు చేసింది. కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్టు రైట్ కెనాల్ వద్ద ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని పెంచుతూ రోజుకు 6 నుంచి 8 టీఎంసీలు రాయలసీమకు తీసుకువెళ్లడానికి వీలుగా లిఫ్టును నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 203 ఆర్‌టీ‌ని జారీ చేసిన విషయం తెలిసిందే.



Next Story