రైల్వే ఉద్యోగులకు కోవిడ్ టీకా

by  |
రైల్వే ఉద్యోగులకు కోవిడ్ టీకా
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే చిలకలగూడ హెల్త్ యూనిట్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని సూచించారు. కోవిడ్ లక్షణాలు లేని వారిని గుర్తించడానికి, వ్యాధి వ్యాప్తించకుండా ఉండేందుకు డివిజనల్ హెడ్ క్వాటర్స్ , సంచాలన్ భవన్ వద్ద సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

ఏప్రిల్ 1న కాజీపేటలో కోవిడ్ కేర్ సెంటర్ వద్ద రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబసభ్యులకు వ్యాక్సినేషన్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా.సి.రవీంద్ర శర్మ, సికింద్రాబాద్‌ డివిజన్‌ అడిషినల్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ రవిచంద్రన్‌ పాల్గొన్నారు.


Next Story

Most Viewed