టీఆర్ఎస్‌ నేతపై కోటగిరి ఎంపీటీసీ ఆగ్రహం

224

దిశ, కోటగిరి: కోటగిరి సర్పంచ్ పత్తి లక్ష్మణ్ గ్రామంలో అభివృద్ధి చేయనందుకే ఎంపీటీసీగా ఓడించారని.. కాంగ్రెస్ నేత (ఎంపీటీసీ) కొట్ట మనోహర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ పోచారం ఫ్యామిలీపై కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు అనడం విడ్డూరంగా ఉందన్నారు. స్పీకర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, సొసైటీ పరిధిలో ధర్మ కేంద్రంగా రైతులకు జరిగిన మోసం పట్ల స్పీకర్, అతని కుమారుడు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని మాత్రమే ప్రశ్నించానన్నారు. కానీ, సర్పంచ్ లక్ష్మణ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ కార్యకర్తల పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సబబు కాదన్నారు. కోటగిరిలో చాలా అభివృద్ధి చేశాము అని చెబుతున్న సర్పంచ్ మూడేళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు పూర్తి చేయలేక పోయారని ఎద్దేవా చేశారు.