వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. వీడియో వైరల్!

23

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లాలో ఒల్లు గగుర్పొడిచే ఘటన ఒకటి చోటుచేసుకుంది. రెండస్థుల భవనంపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.ఈ ఘటన జిల్లాలోని కోతిరాంపూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. కొండయ్య అనే వ్యక్తి రెండస్థుల బిల్డింగ్ ఎక్కి కిందకు దూకుతానంటూ స్థానికంగా హల్‌చల్ సృష్టించాడు. కిందకు దిగాలని కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినకుండా కిందకు దూకేశాడు. ఆ దృశ్యాన్ని స్థానికులు మొబైల్‌లో చిత్రీకరించారు. కరెంట్ తీగలకు తగిలి కిందపడటంతో తీవ్రగాయాలపాలైన కొండయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. ఇదిలాఉండగా, రెండ్రోజుల కిందటే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న కొండయ్య‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కాగా, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా తెలియరాలేదు.