ఆ జట్టులో కోహ్లీ‌కి నో చాన్స్.. షాక్‌లో ఫ్యాన్స్..!

75

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక క్రికెట్‌ మ్యాగజీన్‌ విజ్డెన్‌ అల్మనాక్‌ ఈ తరం వరల్డ్ టెస్ట్ ఎలెవన్‌ని ప్రకటించింది. ప్రస్తుత ఫామ్, ఓవరాల్ రికార్డ్స్ పరిగణలోకి తీసుకొని ఈ జట్టును ఎంపిక చేసింది. అయితే భారత్ నుండి నలుగురు ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలతో పాటు ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు ఈ అత్యుత్తమ జట్టులో చోటు దక్కింది. అయితే టెస్ట్ క్రికెట్‌కు ప్రతిరూపంగా నిలిచే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీకి బదులు ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్‌కు ఆ స్థానంలో చోటు దక్కింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..