ఇంటికి చేరుకున్న కివీస్ ఆటగాళ్లు

by  |
ఇంటికి చేరుకున్న కివీస్ ఆటగాళ్లు
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన కివీస్ ఆటగాళ్లు తమ దేశానికి క్షేమంగా చేరుకున్నారు. శనివారం రాత్రి జపాన్ రాజధాని టోక్యో మీదుగా వాళ్లు న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్‌కు చేరుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. బోర్డు ఏర్పాటు చేసిన బంబార్డియన్ గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ జెట్‌లో వారందరూ క్షేమంగా చేరుకొని ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇక మరో బ్యాచ్ ఆటగాళ్లను మరో విమానం ద్వారా కివీస్ చేర్చారు. మొదటి ఫ్లైట్‌లో ట్రెంట్ బౌల్ట్, ఫిన్ అలెన్, జిమ్మీ నీషమ్, అడమ్ మిల్నే, స్కాట్ కుగ్లీన్‌తో పాటు కోచ్‌లు షేన్ బాండ్, జేమ్స్ పామ్మెంట్ ఉన్నారు. వీరితో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్రికెటింగ్ ఆపరేషన్ డైరెక్టెర్ మైక్ హెస్సన్ కూడా వెళ్లారు.

మరో ఫ్లైట్‌లో లాకీ ఫెర్గూసన్, బ్రెండన్ మెక్‌కల్లమ్, కామెంటేటర్లు సైమండ్ డల్, స్కాట్ స్టైరిస్, కోచ్‌లు స్టీఫెన్ ఫ్లెమ్మింగ్, కైల్ మిల్స్‌తో పాటు అంపైర్ క్రిస్ గఫానీ కివీస్ చేరుకున్నారు. ఇక కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, కేల్ జేమిసన్, ఫిజియో టామీ సిమ్సెక్ మాల్దీవుల్లోనే ఉన్నారు. వీరు ముగ్గురు నేరుగా ఇంగ్లాండ్ వెళ్తారు. ఇక ట్రెంట్ బౌల్ట్ న్యూజీలాండ్ వెళ్లినా.. జూన్ మొదటి వారం నుంచి స్వదేశంలో జరిగే ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్టుతో జూన్ 16న కలిసి ఇంగ్లాండ్ చేరుకోనున్నట్లు న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు చెప్పింది.



Next Story

Most Viewed