ఉపాధ్యాయులు దిక్కులేని వారయ్యారు: కిషన్ రెడ్డి

by  |
ఉపాధ్యాయులు దిక్కులేని వారయ్యారు: కిషన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయులు దిక్కు లేని వారయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. అబిడ్స్‌లోని ఓ కాలేజ్‌లో టీపీయూఎస్ రాష్ట్ర కార్య నిర్వాహక వర్గ సమావేశానికి హాజరై 2021 నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉపాధ్యాయుల భర్తీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు సంబంధించి ఏ సమస్యలూ పరిష్కృతం కాలేదన్నారు.

నేడో, రేపో ఉపాధ్యాయుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహిస్తామని చేసిన ప్రకటనతో పాటు పీఆర్సీ కోసం ఉద్యోగులను పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందంటే ఆ ఘనత దుబ్బాక , హైదరాబాద్ ప్రజలకు దక్కుతుందన్నారు . దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా తీర్పునిచ్చిన ఓటర్లు ఎంతో విజ్ఞతగా వ్యవహరించారని పేర్కొన్నారు . తెలంగాణ ప్రజలు అనేక నిర్భందాలను, ఉద్యమాలను చవి చూశారని తెలిపారు. దౌర్జన్యం, నిర్భందాలు జరిగినప్పుడల్లా పిడికిలి భిగించి ముందుకు నడిచారని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో కరోన కనుమరుగు కాలేదని, ప్రజలు కరోనతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


Next Story