పంజాబ్ అద్భుత బౌలింగ్.. హైదరాబాద్ ఓటమి

by  |
పంజాబ్ అద్భుత బౌలింగ్.. హైదరాబాద్ ఓటమి
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 43వ మ్యాచ్‌ ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం సాధించింది. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు చివరి వరకు బాల్ టు బాల్ ఆడుతూనే డెత్ ఓవర్లలో అతి దారుణంగా వికెట్లను కోల్పోయారు. డెత్ ఓవర్లలో ఏకంగా 6 వికెట్లను కోల్పోయి మ్యాచ్‌ను పంజాబ్‌కు కట్టబెట్టారు. 19.5 ఓవర్లలోనే 10 వికెట్ల నష్టానికి హైదరాబాద్ కేవలం 114 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పంజాబ్ 12 పరుగుల తేడాతో అనూహ్య విజయం సాధించింది. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లు వేసిన పంజాబ్ బౌలర్లు క్రిస్ జోర్డన్, అర్ష్ దీప్ తలో మూడు వికెట్లు తీసు పంజాబ్‌ను గెలిపించారు.

హైదరాబాద్ ఇన్నింగ్స్:

తొలుత మెరుపు ఇన్నింగ్ ఆడిన సన్‌రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(35), బెయిర్ స్టో(19) ఔట్ కావడంతోనే హైదరాబాద్ బ్యాటింగ్ డీలా పడింది. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే కూడా(15) పరుగులు చేసి బ్యాట్ వదిలేశాడు. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన అబ్దుల్ సమద్ (7), విజయ్ శంకర్ (26), జాసన్ హోల్డర్ (5), ప్రియామ్ గార్గ్ (3) పరుగుల పేలవ ప్రదర్శన చేశారు. ఇక ఆ తర్వాత లోయర్ ఆర్డర్‌లో వచ్చిన ఆటగాళ్లు రషీద్ ఖాన్, సందీప్ శర్మ, కలీల్ అహ్మద్‌లు దారుణంగా డకౌట్ అయ్యారు. దీంతో 19.5 ఓవర్లలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 114 పరుగులు చేసి కుప్పకూలింది.

పంజాబ్ ఇన్నింగ్స్:

ఐపీఎల్ సీజన్‌ 43వ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ పేలవ ప్రదర్శన చేసింది. 66 పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలడం, మిడిలార్డర్‌లో మిగతా బ్యాట్స్‌మెన్లు రాణించకపోవడంతో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులకే పరిమితమైంది. హైదరాబాద్‌ బౌలర్లు తొలి నుంచి సమిష్టిగా రాణిస్తూ కీలక సమయాల్లో పంజాబ్ వికెట్లను తీసుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ బౌలర్లు కుప్పకూలారు. నికోలస్ పూరన్(32) నాటౌట్‌గా నిలిచినా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (27), క్రిస్ గేల్(20), మందీప్ సింగ్(17) పరుగులు మాత్రమే చేశారు. మిగతా ఏ ఆటగాడు కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (12), క్రిస్ జోర్డన్ (7), మురుగన్ అశ్విన్ (4) పరుగులతో సరిపెట్టుకున్నారు. ఇది కాకుండా దీపక్ హుడా (0) డకౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 126 పరుగులతోనే సరిపెట్టుకుంది.

స్కోరు బోర్డు:

Kings XI Punjab Innings:
1. కేఎల్ రాహుల్ (c) (wk) b రషీద్ ఖాన్ 27(27)
2. మందీప్ సింగ్ c రషీద్ ఖాన్ b సందీప్ శర్మ 17(14)
3. క్రిస్ గేల్ c వార్నర్ b హోల్డర్ 20(20)
4. నికోలస్ పూరన్ నాటౌట్ 32(28)
5. గ్లెన్ మ్యాక్స్‌వెల్ c వార్నర్ b సందీప్ శర్మ 12(13)
6. దీపక్ హుడా st బెయిర్ స్టో b రషీద్ ఖాన్ 0(2)
7. క్రిస్ జోర్డన్ c కలీల్ అహ్మద్ b హోల్డర్ 7(12)
8. మురుగన్ అశ్విన్ రనౌట్ (విజయ్ శంకర్)4(4)
9. రవి భిష్ణోయ్ నాటౌట్ 0(0)

ఎక్స్‌ట్రాలు: 7

మొత్తం స్కోరు: 126

వికెట్ల పతనం: 37-1 (మందీప్ సింగ్, 4.6), 66-2 (క్రిస్ గేల్, 9.6), 66-3 (కేఎల్ రాహుల్, 10.1), 85-4 (గ్లెన్ మ్యాక్స్‌వెల్, 13.4), 88-5 (దీపక్ హుడా, 14.2), 105-6 (క్రిస్ జోర్డన్, 17.3), 110-7 (మురుగన్ అశ్విన్, 18.2)

బౌలింగ్:

1. సందీప్ శర్మ 4-0-29-2
2. కలీల్ అహ్మద్ 4-0-31-0
3. జోస్ హోల్డర్ 4-0-27-2
4. రషీద్ ఖాన్ 4-0-14-2
5. టీ.నటరాజన్ 4-0-23-0

Sunrisers Hyderabad Innings:
1. డేవిడ్ వార్నర్ (c)c రాహుల్ b రవి భిష్నోయ్ 35(20)
2. జానీ బెయిర్ స్టో (wk)b మురుగన్ అశ్విన్ 19(20)
3. మనీష్ పాండే c (sub)జె సుచిత్ b క్రిస్ జోర్డన్ 15(29)
4. అబ్దుల్ సమద్ c క్రిస్ జోర్డన్ b షమీ 7(5)
5. విజయ్ శంకర్ c రాహుల్ b అర్ష్‌దీప్ సింగ్ 26(27)
6. జాసన్ హోల్డర్ c మందీప్ b జోర్డన్ 5(8)
7. ప్రియమ్ గార్గ్ నాటౌట్ c జోర్డన్ b అర్ష్‌దీప్ సింగ్ 3(5)
8. రషీద్ ఖాన్ c పూరన్ b క్రిస్ జోర్డన్ 0(1)
9. సందీప్ శర్మ నాటౌట్ c మురుగన్ అశ్విన్ b అర్ష్‌దీప్ సింగ్ 0(2)
10.కలీస్ అహ్మద్ రనౌట్ 0(2)
11. టి. నటరాజన్ నాటౌట్ 0(0)

ఎక్స్‌ట్రాలు: 4

మొత్తం స్కోరు:114-10

వికెట్ల పతనం: 56-1 (డేవిడ్ వార్నర్, 6.2), 58-2 (జానీ బెయిర్ స్టో, 7.2), 67-3 (అబ్దుల్ సమద్, 8.5), 100-4 (మనీష్ పాండే, 16.1), 110-5 (విజయ్ శంకర్, 17.5), 112-6 (జాసన్ హోల్డర్, 18.3), 112-7 (రషీద్ ఖాన్, 18.4).114-8 (సందీప్ శర్మ, 19.2), 114-9 (ప్రియమ్ గార్గ్, 19.3), 114-10 (కలీల్ అహ్మద్, 19.5).

బౌలింగ్:

1. మహ్మద్ షమీ 4-0-34-1
2. అర్ష్‌దీప్ సింగ్ 3.5-0-23-3
3. మురుగన్ అశ్విన్ 4-0-27-1
4. రవిభిష్నోయ్ 4-0-13-1
5. క్రిస్ జోర్డన్ 4-0-17-3


Next Story

Most Viewed