కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

58

దిశ, వెబ్‌డెస్క్ : కేరళలో లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ప్రస్తుతం అక్కడ మే 16తో తొలిదశ లాక్‌డౌన్ కాలపరిమితి ముగియనుంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 35వేలకు పైగా కేసులు నమోదు కాగా, 95 మందికి పైగా మృతి చెందారు. రోజురోజుకూ కొవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో మే 23వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడగిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..