కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి : ఎమ్మెల్యే సీతక్క

by  |
కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి : ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, ములుగు : తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు కేసీఆర్ పాలనలో ఒరిగింది ఏమి లేదని సీతక్క విమర్శించారు. ఎన్నికలు వస్తేనే ముఖ్య మంత్రికి హామీలు గుర్తుకు వస్తాయి అని, హామీలు ఇవ్వడం తప్పా అమలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ కాదని అన్నారు.

కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని, దళిత బంధు ఒక్క హుజురాబాద్ కు కాదు రాష్ట్రం మొత్తం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటానని, మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న, మచ్చ శాఖ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, మండలాధ్యక్షుడు ఏండి చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed