సర్దార్‌‌గా మారిన సుల్తాన్.. సీరియస్ రగ్డ్ లుక్‌లో కార్తి

by  |
sardar movie
X

దిశ, సినిమా : కోలీవుడ్ హీరో కార్తి నటించిన ‘సుల్తాన్’ సినిమా ఇటీవల విడుదలై, మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా అప్పుడే తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేశాడు కార్తి. విశాల్ హీరోగా వచ్చిన ‘అభిమన్యుడు’ ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘సర్దార్’ పేరును కన్ఫర్మ్ చేస్తూ కర్టైన్ రైజర్ విడుదల చేశారు మేకర్స్.

ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌లో కార్తి పొడవాటి జుట్టు, తెల్లగడ్డంతో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ భారత్ – చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్ పిక్చర్స్ సమర్పణలో ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రంలో రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లు. తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


Next Story