రష్మిక ఫస్ట్ కోలీవుడ్ మూవీ మేజర్ అప్‌డేట్

by  |
రష్మిక ఫస్ట్ కోలీవుడ్ మూవీ మేజర్ అప్‌డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ రష్మిక మందన తొలి కోలీవుడ్ ప్రాజెక్ట్ ‘సుల్తాన్’. టాలెంటెడ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కార్తి హీరోగా వస్తోన్న ఈ సినిమాకు బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహించారు. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు నిర్మిస్తున్నారు. అజయ్ దేవగన్ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం గురించి మేజర్ అప్‌డేట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ ఎస్ఆర్ ప్రభు. సుల్తాన్ ట్రైలర్ ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అదే రోజు సినిమా రిలీజ్ గురించి హింట్ ఇచ్చే అవకాశం ఉంది.

‘సుల్తాన్’ ఓటీటీలో రిలీజ్ అవుతుందని ఈ మధ్య కోలీవుడ్‌లో చర్చ జరగ్గా..కాదు థియేటర్స్‌లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని లేటెస్ట్ ఇన్‌ఫర్మేషన్. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతుండగా.. సోమవారం ఓటీటీ లేదా థియాట్రికల్ రిలీజ్? అనే దానిపై క్లారిటీ రానుంది. వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్న సినిమాలో కార్తీ ఫస్ట్ లుక్ పోస్టర్ అక్టోబర్ 26, 2020న రిలీజ్ కాగా, సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.



Next Story