రక్తదానంతో ఒకరికి ప్రాణమిచ్చినట్టే: సీపీ, కలెక్టర్

by  |
రక్తదానంతో ఒకరికి ప్రాణమిచ్చినట్టే: సీపీ, కలెక్టర్
X

దిశ, కరీంనగర్: రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణ దానం చేసినట్టేనని కరీంగనగర్ సీపీ విబి కమలాసన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శశాంకలు అన్నారు. స్థానిక ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌లో అధికారులతో కలిసి శుక్రవారం రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి కోసం రక్తదానం చేశామని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తాన్ని ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మూడు నెలలకు ఓ సారి మగవారు, నాలుగు నెలలకోసారి ఆడవాళ్లు రక్తదానం చేయొచ్చని
తెలిపారు.

కంటైన్‌మెంట్ ఏరియాలపై ప్రత్యేక శ్రద్ద..

అనంతరం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అధికారులతో కలెక్టర్ శశాంక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..50 ఇళ్లకు ఓ క్లస్టర్ గా చేసుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్బన్, రూరల్ ఏరియాలో ప్రతి సెక్టార్ కు 4 నుండి 5 టీం లు ఏర్పాటు చేసి, ఈ టీంలలో హెల్త్ సూపర్ వైజర్, డాక్టర్, మున్సిపల్ ఏ.ఈ, డిప్యూటీ తహశీల్దార్ లు ఉండేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. ప్రతి ఇంటిని రోజుకు రెండుసార్లు సందర్శించి కంటైన్‌మెంట్ ఏరియాలో నివసిస్తున్న వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీయాలని సూచించారు.

Tags: Karimnagar,cp,collector,Blood donation

Next Story

Most Viewed