ఏజెన్సీలో మూగజీవాల వేదన.. అందని ద్రాక్షగా వైద్యం

by  |
veterinarian doctor
X

దిశ, కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన కరకగూడెం మండలంలో ఎక్కువశాతం రైతులు వ్యవసాయం తర్వాత పాడిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. మండలంలో పూర్తిస్థాయి పశువైద్యాధికారి బదిలీపై వెళ్లడంతో పశువైద్యం సకాలంలో అందక మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. ప్రస్తుతం పశువులాస్పత్రిలో ఒకే ఒక్క అటెండర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నాడు. రోగంతో ఆసుపత్రికి తీసుకొచ్చిన మూగజీవాలకు తనకు తెలిసిన వైద్యం చేసి నయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మండలంలో గొల్ల, కురుమ, యాదవులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రెండో విడత గొర్రెలను నిలిపివేసింది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొర్రెలను పంపిణీ చేసి, తక్షణమే పశువుల ఆసుపత్రి వైద్యాధికారిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు.



Next Story

Most Viewed