sweat : మానవ శరీరంలో చెమటలు పట్టని ఒకే ఒక భాగం.. అదేమిటంటే..

by Javid Pasha |
sweat : మానవ శరీరంలో చెమటలు పట్టని ఒకే ఒక భాగం.. అదేమిటంటే..
X

దిశ, ఫీచర్స్ : మనం ఎక్కువగా పనిచేసినప్పుడు కానీ, ఎండలో తిరిగినప్పుడు కానీ శరీరంపై చెమటలు పడుతుంటాయి. అలాగే వ్యాయామాలు చేసినప్పుడు, వివిధ రకాల ఫిజికల్ యాక్టివిటీస్‌లో పాల్గొన్నప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటాం. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలవల్ల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీనికితోడు చెమటలు పట్టడం మరింత అసౌకర్యంగా ఉంటుంది. అయినప్పటికీ చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఇవి బాడీ టెంపరేచర్‌ను కంట్రోల్ చేయడంలో కీ రోల్ పోషిస్తాయి. కానీ ఒక లెవల్ దాటితే మాత్రం కాస్త అన్ కంఫర్టబుల్‌గా ఉంటుంది.

చెమట అధికంగా పట్టడంవల్ల శరీరంలో బ్యాడ్ స్మెల్, దురద, చికాకు, బట్టలపై మరకలు వంటివి ఏర్పడుతూ అసౌకర్యానికి గురిచేస్తుంటాయి. కొందరికి చెమట వాసన పడక జర్నీలో ఉన్నప్పుడు తలనొప్పి రావచ్చు. ఇక మేకప్ వేసుకునే వారికి అయితే అధిక చెమటవల్ల అది త్వరగా చెదిరిపోతుంది. శరీర భాగంలోని వీపు, పొట్ట, తొడలు, మెడ, చంకలు, చేతులు, పాదాలు దాదాపు ఇలా అన్ని భాగాలకు చెమటపడుతుంది. దీనివల్ల కాస్త అసౌకర్యంగా అనిపించినా ఫైనల్‌గా చెమటపట్టడం అనేది ఆరోగ్య లక్షణం. అయితే మానవ శరీరంలోని ఒకే ఒక భాగానికి మాత్రం చెమటపట్టదు. ఆ భాగమే పెదవులు. ఇక్కడ స్వేద గ్రంథులు ఉండవు కాబట్టి చెమట పట్టదని నిపుణులు చెప్తున్నారు. ఈ కారణంగానే దాహం వేసినప్పుడు, ఫిజికల్ యాక్టివిటీస్‌లో పాల్గొన్నప్పుడు పెదవులు తడారిపోతుంటాయి.

Next Story

Most Viewed