దేవీ శరన్నవరాత్రులు.. రూ.మూడున్నర కోట్లతో ధనలక్ష్మీ అలంకరణ

by  |
దేవీ శరన్నవరాత్రులు.. రూ.మూడున్నర కోట్లతో ధనలక్ష్మీ అలంకరణ
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు అమ్మవారిని శుక్రవారం ధనలక్ష్మీగా అలంకరించి పూజలు నిర్వహించారు. మూడు కోట్ల యాభై ఒక్క లక్ష రూపాయలతో ఆర్యవైశ్య సంఘం సభ్యులు అమ్మవారికి అలంకరణ చేశారు.

ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందిమల్ల సురేష్, నరహరి శ్రీనివాసులు, బిల్ల కంటి రాము తదితరుల ఆధ్వర్యంలో భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు, విశిష్ట పూజలు జరిపారు. మూడు కోట్ల 50 లక్షల రూపాయల నగదుతో అలంకరింపబడిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


Next Story