ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన కమల్‌ప్రీత్ కౌర్

by  |
ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన కమల్‌ప్రీత్ కౌర్
X

దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలంపిక్స్‌లో మరో బెర్త్ కన్ఫార్మ్ అయ్యింది. డిస్కస్ త్రో విభాగంలో కమల్‌ప్రీత్ కౌర్ టోక్యో ఒలంపిక్స్ అర్హత సాధించింది. శుక్రవారం పటియాలలో జరగుతున్న ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కమల్‌ప్రీత్ కౌర్ తొలి ప్రయత్నంలోనే 65.06 మీటర్లు విసిరి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించాలంటే 63.5 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసరాల్సి ఉంది. అయితే కమల్‌ప్రీత్ కౌర్ 65.06 మీటర్లు విసిరి గతంలో కృష్ణ పూనియ (64.76 మీటర్లు) నెలకొల్పిన జాతీయ రికార్డును సైతం బద్దలు కొట్టింది. రైల్వేస్‌కు ప్రాతినిథ్యం వహించే కమల్‌ప్రీత్ ప్రస్తుతం మహిళా డిస్కస్ త్రోలో 65 మీటర్ల సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించినట్లు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Next Story

Most Viewed