జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

by  |
Journalists
X

దిశ, తెలంగాణ బ్యూరో : జర్నలిస్టులను సూపర్ స్పెడ్డర్స్‌గా కాదని… ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కోరారు. దాసోజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్స్ మీడియా జర్నలిస్టులకు నిత్యావసరాలతో పాటు కరోనా నియంత్రణ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం గాంధీ భవన్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాకు ఎదురుగా నిలిచి అనేక మంది జర్నలిస్ట్ లు అహర్నిశలు పనిచేశారని, యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, వారందరికీ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలని, జర్నలిస్ట్ కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరిచి ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో.. ఏ లక్ష్యం కోసం 1500బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారో .. వారి లక్ష్యాలు సఫలీకృతం చేయాలని కోరారు.

నేడు రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగ యువత దిక్కు తోచని పరిస్థితిలో ఉందని అన్నారు. రిక్రూట్మెంట్ క్యాలెండర్ లేదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed