ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 596 ఖాళీలు

by Disha Web Desk 17 |
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 596 ఖాళీలు
X

దిశ, కెరీర్: ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 596

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్ - సివిల్) - 62

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్ - ఎలక్ట్రికల్) - 84

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) - 440

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) - 10

అర్హత: 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ (సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/ఆర్కిటెక్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: జనవరి 21, 2023 నాటికి 27 ఏళ్లు మించరాదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ. 40,000 నుంచి 1,40,000 ఉంటుంది.

ఎంపిక: గేట్ 2020/గేట్ 2021/గేట్ 2022 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు స్వీకరణకు ప్రారంభ తేదీ: డిసెంబర్ 22, 2022

చివరి తేదీ: జనవరి 21, 2023

వెబ్‌సైట్: https://www.aai.aero


Next Story

Most Viewed