బీసీ సంక్షేమ మహిళా వ్యవసాయ కళాశాలల్లో టీచింగ్ అసోసియేట్లు

by Disha Web Desk 17 |
బీసీ సంక్షేమ మహిళా వ్యవసాయ కళాశాలల్లో టీచింగ్ అసోసియేట్లు
X

దిశ, కెరీర్: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్, వనపర్తిలోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ టీచింగ్ అసోసియేట్ ఖాళీల భర్తీకి మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

గెస్ట్ టీచింగ్ అసోసియేట్ - 20 పోస్టులు

విభాగాలు: అగ్రోనమీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ, ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్..

అర్హత: ఎంఎస్సీ (అగ్రికల్చర్/హార్టికల్చర్/అగ్రికల్చర్ ఇంజనీరింగ్/అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం: నెలకు పీహెచ్ డీ అభ్యర్థులకు రూ. 45,000. పీజీ అభ్యర్థులకు రూ. 40,000 ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 14, 15 డిసెంబర్ 2022.

వేదిక : 6వ అంతస్తు, డీఎస్ఎస్ భవన్, మసాబ్ ట్యాంక్, హైదరాబాద్.

చివరి తేదీ: డిసెంబర్ 9, 2022.

వెబ్‌సైట్: http://mjptbcwreis.telangana.gov.ఇన్

READ MORE

హైదరాబాద్ జిల్లాలో సోషల్ వర్కర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు


Next Story

Most Viewed