తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు

74

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల వల్ల ఇప్పటికే అతలాకుతలం అయిన తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ వర్ష ప్రమాదం పొంచిఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని, దీంతో రానున్న రెండురోజులపాటు భారీ వర్షాలు కురవవచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న ఆది, సోమవారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.