ISRO రికార్డును బ్రేక్ చేసిన SPACE-X.. 143 శాటిలైట్స్ లాంచ్!

by  |
ISRO రికార్డును బ్రేక్ చేసిన SPACE-X.. 143 శాటిలైట్స్ లాంచ్!
X

దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)పేరిట ఉన్న రికార్డును స్పేస్ ఎక్స్ (SPACE-X)బ్రేక్ చేసింది. 2017వ సంవత్సరంలో ఇస్రో PSLV-C37విమాన వాహకనౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపి అగ్యరాజ్యాలు సైతం సాధించలేని కీర్తిని భారత్ తొలి ప్రయోగంలోనే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఒక్క ప్రయోగంతో భారత్ అంతరిక్ష పరిశోధనల్లో గత నాలుగేండ్లుగా రారాజుగా కొనసాగుతోంది.

అయితే, అమెరికాకు చెందిన ఓ ప్రయివేటు స్పేస్ ఎక్స్ సంస్థ ఇస్రో నెంబర్ వన్ స్థానానికి గండి కొట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన ఎలన్ మస్క్ (టెస్లా మోటార్స్ అధినేత) ఇటీవల స్పేస్ ప్రొగ్రామ్స్‌లోకి అడుగుపెట్టారు. తక్కువ ఖర్చులో ఉపగ్రహాలను నింగిలోకి పంపించాలన్నది అతని ధ్యేయం. ఈ నేపథ్యంలోనే ఫాల్కన్-9 విమాన వాహకనౌక ద్వారా ట్రాన్స్పోర్టర్ మిషన్-1 పేరిట ఒకేసారి 143 శాటిలైట్లను తొలి ప్రయోగంలోనే నింగిలోకి పంపి సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. దీంతో ఇన్నిరోజులు ఇస్రో పేరిట ఉన్న 104 శాటిలైట్ల రికార్డును స్పేస్ ఎక్స్ సంస్థ బద్దలు కొట్టింది. అయితే, 143 ఉపగ్రహాల్లో 133 కమర్షియల్ మరియు అమెరికా ప్రభుత్వానికి సంబంధించినవి ఉండగా, 10 కంటే ఎక్కువ స్టార్ లింక్ ఉపగ్రహాలను పంపించినట్లు సమాచారం. కాగా, స్మాల్‌సాట్ రిడ్‌షేర్ ప్రొగ్రాం మిషన్ ద్వారా ఫస్ట్ డెడికేటెడ్ ప్రయోగం నిర్వహించినట్లు స్పేస్ ఎక్స్ సంస్థ ప్రకటించింది.



Next Story

Most Viewed