ఒలింపిక్స్ మళ్లీ వాయిదా?

by  |
ఒలింపిక్స్ మళ్లీ వాయిదా?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ప్రభావం క్రమంలో టోర్నీలన్ని వాయిదా పడుతున్నాయి. అందులో భాగంగా ఒలింపిక్స్ కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది జపాన్‌లో జరగాల్సిన ఒలింపిక్స్‌ను కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఈ ఏడాది జులైలో జపాన్‌లో జరగాల్సి ఉంది. ప్రస్తుతం జపాన్‌లో కరోనా తీవ్రత ఎక్కువ ఉండటంతో.. దేశంలో అత్యయిక పరిస్థితిని జపాన్ ప్రభుత్వం విధించింది.

ఈ క్రమంలో ఒలింపిక్స్ మళ్లీ వాయిదా పడే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే టోక్యో, ఒసకా, క్యోటో, హ్యోగో ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.



Next Story

Most Viewed