SRH ఓడిపోతే అరగుండు కొట్టించుకుంటానని పందెం.. చివరికి అతని జుట్టు ఎలా అయ్యిందంటే?

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-06 04:30:12  IST  )

ఐపీఎల్-2025 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ఆటతీరు అనుకున్న స్థాయిలో ఉండటం లేదు.

SRH ఓడిపోతే అరగుండు కొట్టించుకుంటానని పందెం.. చివరికి అతని జుట్టు ఎలా అయ్యిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2025 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ఆటతీరు అనుకున్న స్థాయిలో ఉండటం లేదు. వరుస ఓటములతో అటు యాజమాన్యాన్ని, ఇటు అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్‌(RR)తో జరిగిన తొలి మ్యాచ్‌లో సూపర్ విక్టరీ సాధించి.. అద్భుతంగా ఆరంభించినా.. ఆ తర్వాత వరుసగా ఓటముల పాలవుతోంది. లక్నోతో, ఢిల్లీతో, కేకేఆర్‌తో ఇలా వరుసగా హ్యాట్రిక్ ఓటమి చెందింది. అయితే, కేకేఆర్‌(KKR)తో మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. SRH టాస్ గెలిచిన అనంతరం ఓ ఇద్దరు యువకులు పందెం వేసుకున్నారు. హైదరాబాద్ గెలస్తుందని ఒకరు, కో‌ల్‌కతా గెలుస్తుందని మరోకరు సవాల్ చేసుకున్నారు.

ఈ పందెంలో ఎవరు ఓడిపోతే వారు అరగుండు చేయించుకోవాలని కండీషన్ పెట్టుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఎస్‌ఆర్‌హెచ్(SRH) ఓటమి పాలు కావడంతో ఆ యువకుడు గుండు కొట్టించుకోక తప్పలేదు. సదరు యువకులే స్వయంగా ట్రిమ్మర్ సాయంతో ఎస్ఆర్‌హెచ్ అభిమానికి అరగుండు చేశారు. గుండు చేస్తున్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీశారు. అవి కాస్త సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. గమనించిన ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు ఇంకోసారి ఇలాంటి పందాలు కట్టకు బ్రో అని సలహా ఇస్తున్నారు.

Next Story