కోహ్లీ సూప‌ర్ సెంచ‌రీ...కేకేఆర్ పై ఆర్సీబీ విక్ట‌రీ

by velandi.Saikiran |   (  Updated:2026-05-13 18:56:46  IST  )

కోహ్లీ సూప‌ర్ సెంచ‌రీ చేసిన నేప‌థ్యంలో కేకేఆర్ పై ఆర్సీబీ విక్ట‌రీ సాధించింది.

కోహ్లీ సూప‌ర్ సెంచ‌రీ...కేకేఆర్ పై ఆర్సీబీ విక్ట‌రీ
X

దిశ‌, వెబ్ డెస్క్: కేకేఆర్ పై బెంగుళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 58 బంతుల్లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, కేకేఆర్ ను చిత్తు చేసి, ప్లే ఆఫ్స్ వెళ్లే ఆర్సీబీ రూట్ క్లియర్ చేశాడు. బెంగళూరు, కేకేఆర్ జట్ల మధ్య బుధవారం రాయ్ పూర్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్, 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది.

అయితే ఈ భారీ లక్ష్యాన్ని బెంగుళూరు అవలీలగా ఛేదించింది. 19.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఊది పడేసింది బెంగళూరు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులు చేయగా, పడిక్కల్ 39 పరుగులతో రాణించారు. ఈ దెబ్బకు ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. ఈ విక్టరీతో పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానానికి దూసుకు వెళ్ళింది ఆర్సీబీ.

Next Story