శాంసన్ మెరుపులు.. చెన్నై గెలుపు

by Muthe.Rajitha |

ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో చెన్నై సూపర్‌కింగ్స్ ఘనవిజయం సాధించింది.

శాంసన్ మెరుపులు.. చెన్నై గెలుపు
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో చెన్నై సూపర్‌కింగ్స్ ఘనవిజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సునాయాస విజయాన్ని అందుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో దిల్లీ బ్యాటర్లు భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యారు. తక్కువ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతూ కేవలం 17.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ విజయంలో సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. క్రీజులోకి వచ్చీ రావడంతోనే ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సంజు, మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 52 బంతుల్లోనే 87 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో చెన్నై సూపర్‌కింగ్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోగా, సొంత గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌కు పరాభవం తప్పలేదు.

Next Story