హజ్ యాత్రకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఎప్పుడంటే..?

by  |
Hajj Yathra
X

దిశ, వెబ్‌డెస్క్ : హజ్ యాత్ర చేపట్టే వారి నుంచి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా (హెచ్‌సీఐ) ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానం పలికింది. హెచ్‌సీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్ లైన్ లేదా ప్రత్యేక యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నవంబర్ 1 నుంచి జనవరి 31, 2022 వరకు గడువు ఉందని పేర్కొన్నది. ఈ మేరకు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనను విడుదల చేసింది.

దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో ఫైల్ చేసే ముందు హజ్ కమిటీ వెబ్‌సైట్ www.hajcommittee.gov.inలో హజ్-2022 కోసం తాత్కాలిక హజ్ మార్గదర్శకాలను అనుసరించాలని తెలిపారు. హజ్ దరఖాస్తు ఫారమ్‌లను ఆన్‌లైన్‌లో హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో లేదా ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ “HAJ COMMITTEE OF INDIA” ద్వారా మాత్రమే చేయాలని వివరించింది. యాత్రికులు హజ్ మార్గదర్శకాలలో సూచించిన విధంగా అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలని, ఏదైనా స్పష్టత కోసం 0194-2495365, 0194-2495367 నంబర్లను సంప్రదించాలని కోరింది. హజ్ 2022కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం హజ్ కమిటీ అధికారిక వెబ్‌సైట్ www.hajcommittee.gov.in ను సంప్రదించాలని సూచించింది.

Next Story

Most Viewed