వచ్చే నెలాఖరు దాకా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌ బ్యాన్

by  |
 వచ్చే నెలాఖరు దాకా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌ బ్యాన్
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నెల పొడిగించింది. వచ్చే నెల 31 వరకు అన్ని అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్స్‌ సేవలను బ్యాన్ చేస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తాజాగా సర్క్యూలర్ జారీ చేసింది. ఈ నిషేధం నుంచి కార్గో ఫ్లైట్స్, ఏవియేషన్ రెగ్యులేటర్ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలకు మినహాయింపునిచ్చింది. అంతర్జాతీయ విమాన సేవలపై గతేడాది మార్చి నుంచి కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఫస్ట్ వేవ్ విజృంభణ కాస్త తగ్గడంతో యూకే, యూఎస్, యూఏఈ, కెన్యా, ఫ్రాన్స్‌లాంటి 27 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని ఇండియా కుదుర్చుకున్నది. కానీ, రెండో దశ విజృంభణతో అమెరికా, యూకే, కెనడాలు భారత విమాన సేవలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు.

Next Story

Most Viewed