'ఆయనో గ్లోబల్‌ లీడర్‌ కావొచ్చు… అంత మాత్రాన'

by  |
ఆయనో గ్లోబల్‌ లీడర్‌ కావొచ్చు… అంత మాత్రాన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల వరకూ పార్టీలో తీవ్ర వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కేరళ కాంగ్రెస్ అంతర్గత వివాదాలు తారా స్థాయికి చేరాయి. ఇటీవల పార్టీలో సంస్థాగత ప్రక్షాళన, పూర్తిస్థాయి నాయకత్వం ఎన్నిక అంశాలతో 23 మంది కాంగ్రెస్‌ సీనియర్లు రాసిన లేఖ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. నిన్న యూపీకి చెందిన జితిన్‌ ప్రసాద్‌ను బహిష్కరించాలన్న డిమాండ్‌ తెరపైకి రాగా..

ఇవాళ కేరళకు చెందిన ఎంపీ శశి థరూర్‌పై ఆ పార్టీ ఎంపీ, కేరళ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొడుక్కున్నిల్‌ సురేశ్‌ తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయనో అతిథి కళాకారుడని దుయ్యబట్టారు. ‘శశి థరూర్‌ ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాదు. ఆయన కాంగ్రెస్‌ పార్టీలోకి ఓ గెస్ట్‌ ఆర్టిస్ట్‌గా వచ్చారు. ప్రస్తుతం అలానే కొనసాగుతున్నారు’ అని విమర్శలు చేశారు.

‘ఆయనో గ్లోబల్‌ లీడర్‌ కావొచ్చు. అంత మాత్రన తన ఇష్టమొచ్చింది మాట్లాడడం, చేయడం సరికాదు. పార్టీ విధానాలను అనుసరించాల్సిందే” అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇటీవల తిరువనంతపురం విమానాశ్రయాన్ని అదానీ ఎంటర్‌ప్రైజస్‌కు 50 ఏళ్ల లీజుకు ఇస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడంతో థరూర్‌పై ఆ పార్టీ రాష్ట్ర నేతలు మండిపడుతున్నారు.

Next Story

Most Viewed