ఢిల్లీలో పటిష్ట భద్రత.. రైతు ర్యాలీలో హింసకు పాక్ కుట్ర

by  |
ఢిల్లీలో పటిష్ట భద్రత.. రైతు ర్యాలీలో హింసకు పాక్ కుట్ర
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఓ వైపు రిపబ్లిక్ వేడుకలు జరుగుతుండగా మరో వైపు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు మంగళవారం ట్రాక్టర్ ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ ర్యాలీలో దాయాది పాకిస్థాన్ విధ్వంసానికి కుట్ర చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ డే వేడుకలు జరిగే పరిసరాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. రాజపథ్ చుట్టు పక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతులు నిర్వహించే ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు పరిమితులు, షరతులు విధించారు.

సుమారు 37 నిబంధనలతో ర్యాలీకి అనుమతించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాక్టర్ ర్యాలీకి అనుమతించారు. 5వేల ట్రాక్టర్లు, 5వేల మంది రైతులకు మాత్రమే ఢిల్లీ పోలీసులు పర్మిషన్ ఇచ్చారు.అభ్యంతరకర పోస్టర్లు, బ్యానర్లు ఉండొద్దని ఆదేశాలు జారీ చేశారు. ముందుగా అనుమతించిన రూట్ లో మాత్రమే ర్యాలీ నిర్వహణకు అనుమతి ఉండగా.. ధర్నాలు, రోడ్లపై బైఠాయించకూడదని షరతులు విధించారు.

Next Story

Most Viewed