కంటెంట్ క్రియేటర్స్‌కు గుడ్‌న్యూస్.. రీల్స్ నిడివి పెంచిన ఇన్‌స్టా!

by  |
కంటెంట్ క్రియేటర్స్‌కు గుడ్‌న్యూస్.. రీల్స్ నిడివి పెంచిన ఇన్‌స్టా!
X

దిశ, ఫీచర్స్ : తొలిగా కేవలం ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునేందుకు పరిమితమైన ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ బ్యాన్ కావడంతో వీడియో కంటెంట్ రూపొందించే వారికి అనువైన వేదికగా మారిన విషయం తెలిసిందే. ప్రారంభించిన నెలలోనే ఫుల్ రెస్పాన్స్‌తో దూసుకుపోయింది. దాంతో రీల్స్ ప్రారంభించిన నెలకే 15 సెకన్ల మాత్రమే ఉన్న రీల్స్ వీడియో నిడివి 30 సెకన్లకు పెంచింది. తాజాగా మరోసారి ఆ నిడివిని పెంచుతున్నట్లు ఇన్‌స్టా తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో వెల్లడించింది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇక 30 సెకన్ల నిడివికి బదులుగా ఒక నిమిషం నిడివితో రూపొందించుకోవచ్చు. ఇది కంటెంట్ క్రియేటర్లకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌ను సృష్టించడానికి సృష్టికర్తలకు ఎక్కువ స్పేస్ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు టిక్‌టాక్‌లో కూడా 60సెకన్ల వీడియోలు షేర్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే టిక్‌టాక్ ప్రస్తుతం ఆ పరిమితి మూడు నిమిషాలకు విస్తరించడంతో ఇన్‌స్టా కూడా అదే మార్గాన్ని అనుసరించడం గమనార్హం.



Next Story

Most Viewed