భైంసా ఘటనలో అమాయకులను అరెస్ట్ చేశారు: ఆచారి

by  |
భైంసా ఘటనలో అమాయకులను అరెస్ట్ చేశారు: ఆచారి
X

దిశ,ఆదిలాబాద్: రాష్ట్ర డీజీపీ భైంసాలో పర్యటించి వాస్తవాలు తెలుసుకోవాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. ఇటీవల జరిగిన భైంసా అల్లర్లలో అనుమానితులుగా అరెస్టయిన హిందు వాహిని నాయకులను జిల్లా కేంద్రంలోని జైల్లో ఉంచారు. కాగా బుధవారం జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ములాకాత్ లో భాగంగా హిందు వాహిని నాయకులను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భైంసా ఘటన పై సమగ్ర విచారణ జరుగుతుందని తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి అన్ని వివరాలను కమిషన్ ముందు ఉంచాలని డీజీపీ, హోం శాఖ కార్యదర్శిని కోరుతామన్నారు. పోలీసులు అమాయకులపై కేసులు బనాయించారన్నారు. సమగ్ర విచారణ జరిపి డీజీపీ, రాష్ట్రపతి,కేంద్ర హోంశాఖ, గవర్నర్లకు నివేదికలను అందజేస్తామని పేర్కొన్నారు. అరెస్టయిన హిందు వాహిని నాయకులను పోలీసులు చిత్రహింసలు పెట్టినట్టు తెలుస్తుందని వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే అసలు అల్లర్లకు కారణం ఏంటి ఎవరు ఎవరి పై దాడి చేశారు అనే విషయం తెలుసుకోకుండా పోలీసులు అమాయకులను అరెస్టు చేసి కేసులు పెట్టి జైల్లో ఉంచడం సరికాదన్నారు. జాతీయ కమిషన్ సభ్యుడు వెంట బీజేపీజిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Next Story

Most Viewed