2030 నాటికి సాఫ్ట్‌వేర్ సేవల పరిశ్రమలో 5 లక్షల కొత్త ఉద్యోగాలు

by  |
typing
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సాఫ్ట్‌వేర్-ఏ సర్వీస్(సాస్) పరిశ్రమ విలువ 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఓ నివేదిక వెల్లడించింది. అదేవిధంగా ఈ పరిశ్రమలో 5 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, అంతర్జాతీయంగా వ్యాపారాలు డిజిటలైజేషన్, ఆటోమేషన్ వైపు వేగవంతంగా కొనసాగుతున్న కారణంగా ఈ వృద్ధి నమోదవనున్నట్టు సాస్‌భూమి నివేదిక తెలిపింది. ‘షేపింగ్ ఇండియా సాస్ ల్యాండ్‌స్కేప్’ పేరుతో వెలువరించిన ఈ నివేదిక ప్రకారం.. ప్రస్తుత దశాబ్దం చివరినాటికి భారత సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీల ఆదాయం 50-70 బిలియన్ డాలర్లు(రూ. 3.5-5-2 లక్షల కోట్లకు) పెరగవచ్చని నివేదిక అభిప్రాయపడింది. భారత సాఫ్ట్‌వేర్ సేవల రంగంలో వెయ్యికి ఫండింగ్ స్టార్టప్ కంపెనీలు, 10 యూనికార్న్ కంపెనీలు ఉన్నాయి.

వీటి వార్షిక ఆదాయం సుమారు 3 బిలియన్ డాలర్లు(రూ. 22.4 వేల కోట్లు) ఉంది. 2030 నాటికి యూనికార్న్ కంపెనీలు 10 రెట్లకు పెరుగుతాయని, వీటి ఆదాయం 1 ట్రిలియన్ డాలర్లను తాకవచ్చని నివేదిక వివరించింది. ప్రస్తుతం పరిశ్రమలో 40 వేల మంది పనిచేస్తున్నారని, దశాబ్దం చివరి నాటికి వీరి సంఖ్య అంతర్జాతీయ మార్కెట్లో 6 శాతం వాటాకు చేరుకోనుందని తెలిపింది. భారత ఐటీ సేవల పరిశ్రమ నాలుగు దశాబ్దాల తర్వాత మెరుగ్గా వృద్ధి సాధిస్తోంది. ఇటీవల టెక్ వ్యవస్థాపకుడు క్లౌడ్ టెక్నాలజీ ద్వారా అన్ని రకాల సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను అందించే వేలాది స్టార్టప్‌లను స్థాపించారు. వీటిలో అనేక కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో సేవలందిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమ ఎదుగుదలకు అద్భుతమైన అవకాశాలున్నాయని సాస్‌భూం వ్యవస్థాపక భాగస్వామి మనవ్ గార్గ్ అన్నారు.

Next Story