ఏప్రిల్‌లో స్వల్పంగా పెరిగిన 'తయారీ'!

by  |
ఏప్రిల్‌లో స్వల్పంగా పెరిగిన తయారీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉండటంతో దేశీయ కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి ఎనిమిది నెలల కనిష్టానికి తగ్గినప్పటికీ, ఏప్రిల్‌లో భారత తయారీ రంగ కార్యకలాపాలు మెరుగుపడ్డాయి. గతేడాది అక్టోబర్ నుంచి కొత్త ఎగుమతి ఆర్డర్లు వేగంగా పెరిగాయి. అనలిటిక్స్ సంస్థ ఐహెచ్ఎస్ మార్కెట్ డేటా ప్రకారం.. ఎగుమతులు పెరగడంతో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) స్వల్పంగా పెరిగి 55.5గా నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. మార్చి నెలకు సంబంధించి ఇది 55.4గా ఉంది. పీఎంఐ సూచీ 50 పైన ఉంటే వృద్ధికి సంకేతంగా భావిస్తారు. ఏప్రిల్‌లో తయారీ రంగంలో ఎగుమతులు పెరిగాయని, అంతర్జాతీయ మార్కెట్లో దేశీయ ఉత్పత్తులకు గిరాకీ భారీగా పుంజుకోవడమే దీనికి కారణమని నివేదిక తెలిపింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో స్థానికంగా లాక్‌డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ ఏప్రిల్‌లో సరుకుల ఎగుమతులు బలంగా ఉన్నాయి. ఇది భారతీయ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌కు సంకేతం. గతేడాది దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉన్నప్పుడూ ఎగుమతులు రికార్డు స్థాయిలో 197 శాతం నమోదైనట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక, ఏప్రిల్‌లో ఉపాధి క్షీణత తగ్గిందని, గతేడాది కాలంలో వ్యాపార విశ్వాసం బలపడిందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ అన్నారు.


Next Story

Most Viewed