అప్ఘన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు.. ఎంతమందంటే ?

by  |
kabul-photo
X

న్యూఢిల్లీ: తాలిబన్ల చెరలో చిక్కుకున్న 168మందిని ఎట్టకేలకు భారత్ కు చేరుకున్నారు. కాబూల్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ఘజియాబాద్ హిండన్ ఐఏఎఫ్ బేస్ క్యాంపులో ల్యాండ్ అయ్యారు. కాగా ఇందులో 107 భారతీయ పౌరులు ఉన్నారని వెల్లడించారు. మరో రెండు విమానాలు ఆదివారం నాడు ఢిల్లీ చేరుకున్నాయి. రోజుకు రెండు విమానాలు చొప్పున కాబూల్ నుంచి నడపనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన అనుమతులను హమీద్ కార్జయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న యూఎస్, నాటో దళాలు మంజూరు చేశాయి.

afgan

విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి దీనికి సంబంధించిన విజువల్స్ ను సోషల్ మీడియా షేర్ చేశారు. ఆదివారం ఉదయం కాబూల్ నుంచి ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు పౌరులను తరలించాయి. వీటిలో ఒకటి తజకిస్తాన్ లోని దుశాంబే నుంచి రాగా, మరొకటి దోహా నుంచి ఇండియాకు చేరినట్లు తెలిపారు. శనివారం భారత్‌కు రావడానికి ఎయిర్ పోర్టుకు వచ్చిన వారిని తాలిబన్లు కిడ్నాప్ చేశారనే వార్తలు కలకలం సృష్టించాయి. కేవలం వారి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి వదిలేసినట్లు తాలిబన్లు తెలిపారు.

అఫ్ఘాన్ మరో 1000 భారత పౌరులు..

afganisthan

భద్రతా కారణాలతో అఫ్ఘాన్ లో ఉన్న ఎంబసీ కార్యలయాన్ని మూసేసి అధికారులు స్వదేశానికి చేరుకున్నారు. మరో 1000 మంది వరకు భారత పౌరులు ఇంకా అఫ్ఘాన్ లోని వివిధ పట్టణాల్లో ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిని తిరిగి దేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అఫ్ఘాన్ లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత పౌరులను స్వదేశానికి తీసుకురావడంపై దృష్టి సారించినట్లు తెలిపారు.

ఒక్కసారిగా భావోద్వేగం..

kabul

అఫ్ఘాన్ వచ్చిన 168 మందిలో 24అఫ్ఘాన్ సిక్కులతో పాటు, ఇద్దరు మైనారీటీ ఎంపీలు కూడా ఉన్నారు. స్వదేశానికి తిరిగి రాగానే భావోద్వేగానికి గురయ్యారు. అఫ్ఘాన్ లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, చాలా బాధగా ఉందని అఫ్ఘాన్ ఎంపీ నరేందర్ సింగ్ తెలిపారు. చావు బతుకుల పరిస్థితుల నుంచి తనను రక్షించినట్లు పేర్కొన్నారు. భారత అధికారుల మా పక్షాన నిలబడ్డారని, త్వరలోనే మరికొందరు అఫ్ఘాన్ పౌరులను తీసుకొస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తజకిస్తాన్ నుంచి వచ్చిన విమానంలో 87 మందిలో ఇద్దరు నేపాలీ పౌరులు ఉన్నట్లు వెల్లడించారు. ‘కాబూల్ నుంచి భారత్ కు తీసుకువచ్చినందుకు మోడీకి, ప్రభుత్వానికి ప్రత్యేక ధన్వవాదాలు తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నా ప్రాణాలను కాపాడింది’ అని అఫ్ఘాన్ సెనెటేర్ అనార్కాలీ హోనార్యార్ అన్నారు.


Next Story

Most Viewed