రెండు గంటలు పెరిగిన భారతీయుల స్క్రీన్ టైమ్

by  |
రెండు గంటలు పెరిగిన భారతీయుల స్క్రీన్ టైమ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ఒక్కసారిగా ప్రపంచ గతిని మార్చేసింది. వ్యక్తిగత జీవితాల నుంచి ప్రపంచ ఎకానమీ వరకు అంతటా పెను మార్పులను తీసుకొచ్చింది. అన్‌లాక్ 1.0 నడుస్తున్నా.. ఇంకా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోక పోవడంతో వారంతా ఆన్‌లైన్ క్లాసుల బాట పట్టారు. ఇక కరోనా భయంతో చాలా మంది ఇంటి పట్టునే ఉంటున్నారు. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్ స్ట్రీమింగ్ వీడియోలు చూసే టైమ్ కూడా పెరుగుతోంది.

స్మార్ట్ ఫోన్ స్క్రీన్ యూసేజ్ టైమ్ ఇది వరకు యావరేజ్‌గా రోజుకు 3 గంటలుగా ఉండేది. ప్రస్తుతం ఆ టైమ్ 5 గంటలకు పెరిగింది. అదే వైఫై (బ్రాడ్ బ్యాండ్) కనెక్షన్ ఉన్న వాళ్ల స్క్రీన్ యూసేజ్ 2.5 గంటల నుంచి 4.5 గంటలకు పెరిగిందని టెలికాం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ మొబిలిటీ అధ్యయనంలో తేలింది.

ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే.. మొబైల్ పరంగా అత్యధిక డేటా వినియోగిస్తోంది భారతీయులే. సగటున ఓ యూజర్ నెలకు 12జీబీల డేటా వాడుతున్నట్లు వెల్లడైంది. ఇక రెండో స్థానంలో నార్త్ అమెరికా నిలిచింది. అక్కడ సగటున ఓ యూజర్ 8.5 గంటల డేటాను వాడుతున్నారు. యూరోపియన్లు 8.2 జీబీ, నార్త్‌ఈస్ట్ ఏసియా 7.5జీబీగా ఉంది. గ్లోబల్ యూజర్ యావరేజ్ తీసుకుంటే.. కేవలం నెలకు 7జీబీగా ఉంది. దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల ద్వారా డేటా వినియోగం 2025 నాటికల్లా నెలకు 25 జీబీ స్థాయికి చేరనుంది. అప్పటి వరకు దేశీయంగా కొత్తగా 41 కోట్ల పైచిలుకు సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల పెరగవచ్చని నివేదికలో పేర్కొంది. 2025 వరకు భారత్‌లో 18 శాతం మంది 5జీ నెట్‌వర్క్‌ను, 64 శాతం మంది 4జీ నెట్‌వర్క్, మిగతా వారు 2జీ/3జీ నెట్‌వర్క్‌ వినియోగిస్తుంటారని వివరించారు.

Next Story

Most Viewed