ఈటలకే IMA సపోర్టు.. టీఆర్ఎస్ ఓటమి పక్కా..?

by  |

దిశ, హుజురాబాద్ : వైద్య ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేసి కరోనా కాలంలో ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పెసరు విజయచందర్ రెడ్డి అన్నారు. ఐఎంఏ ప్రతినిధి బృందం తరఫున హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆరోగ్య భద్రత గురించి ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదన్నారు.

కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందినదన్నారు.ఆరోగ్య మంత్రిగా ఈటల రాజేందర్ ప్రాణాలకు తెగించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. కేసీఆర్‌కు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ, ప్రజలపై లేదని విమర్శించారు. వైద్యరంగం అభివృద్ధి కోసం ఈటల ఎంతగానో కృషి చేశాడన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story