స్లెడ్జింగ్ ఒక దారుణం : ఇషాంత్ శర్మ

by  |
స్లెడ్జింగ్ ఒక దారుణం : ఇషాంత్ శర్మ
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్‌లో స్లెడ్జింగ్ దారుణమైన విషయమని భారత పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. మైదానంలో దిగిన తర్వాత ప్రత్యర్థి జట్టుతో పలురకాల సంభాషణలు జరుగుతుంటాయి. కానీ, వాటిలో స్లెడ్జింగ్‌ను మాత్రం తాను ఆమోదించనని ఇషాంత్ చెప్పాడు. గతంలో ఒక మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ను ఇషాంత్ గేలి చేసిన విషయం చర్చకు దారి తీసింది. ఈ మ్యాచ్‌లో స్మిత్‌ను పదే పదే ఇషాంత్ శర్మ స్లెడ్జ్ చేశాడు. అయితే, అనూహ్యంగా ఇప్పుడు స్లెడ్జింగ్ దారుణమని చెప్పడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ విషయంపై విమర్శలు రావడంతో ఇషాంత్ శర్మ వివరణ ఇచ్చాడు. స్మిత్‌‌ను ఆట నుంచి డైవర్ట్ చేయడానికే అలా చేశాను తప్ప, అతడిని కించపర్చడానికి అలా చేయలేదని చెప్పాడు. స్మిత్ కూడా అంతకు ముందు భారత బౌలర్లను చాలా విసిగించాడని, అందుకే తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని చెప్పాడు. బ్యాట్స్‌మన్‌ను వేరే విధంగా కించపరిస్తే నిషేధం విధిస్తారని తెలిసి, తాను సైలెంట్‌గా అలా ఫోజ్ ఇచ్చానని ఇషాంత్ చెప్పాడు.


Next Story

Most Viewed