స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీకి సిఫార్సు!

by  |
స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీకి సిఫార్సు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: అమెరికా, యూరప్, జపాన్, కొరియా దేశాల నుంచి భారత్‌లోకి దిగుమతి అయ్యే స్టీల్ ఉత్పత్తులపై కేంద్రం యాంటీ డంపింగ్ డ్యూటీ విధించే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా, యూరప్, జపాన్, కొరియా దేశాల నుంచి స్టీల్ ఉత్పత్తులు ఇండియాలోకి సగటు ధర కంటే తక్కువకే దిగుమతి అవుతుండటంతో ఈ సుంకాన్ని విధించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్(డీజీటీఆర్) సిఫార్సు చేసింది. ఇలాంటి పరిణామాల వల్ల దేశీయ స్టీల్ పరిశ్రమకు నష్టాలు వస్తున్నట్టు డీజీటీఆర్ దర్యాప్తులో తేలింది. ఈ స్టీల్ ఉత్పత్తులు సాధారణంగా ఆహారేతర వస్తువులైన పెయింట్స్, రసాయనాలు, బ్యాటరీల ప్యాకేజింగ్‌లలో ఉపయోగిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ స్టీల్ ఉత్పత్తిదారులను ఆదుకోవడానికి కూడా ఈ చర్యలు దోహదపడతాయని దర్యాప్తులో పేర్కొంది. పైదేశాల నుంచి ఉత్పత్తి అవుతున్న స్టీల్ దిగుమతులపై ఐదేళ్ల వరకూ ఈ సుంకాన్ని విధించేందుకు డీజీటీఆర్ సిఫార్సు చేసింది. ఆయా దేశాల నుంచి దిగుమతి అవుతున్న స్టీల్ ఉత్పత్తులపై టన్నుకు 224 డాలర్ల నుంచి 334 డాలర్ల వరకు ఉండాలని చెబుతూనే, నాణ్యత ఆధారంగా స్టీల్ ఉత్పత్తులపై సుంకం పరిధి నుంచి మినహాయింపును తిరస్కరించింది. కాగా, విదేశాల నుంచి ఏవైనా ఉత్పత్తులు, సరుకులు దేశీయ మార్కెట్లలో లభించే ధర కంటే తక్కువకే దిగుమతి జరిగితే వాటిపై విధించే సుంకాన్ని యాంటీ డంపింగ్ డ్యూటీగా పరిగణిస్తారు. ఇలాంటి సుంకాన్ని చాలా దేశాలు విధిస్తాయి.


Next Story

Most Viewed