పది లక్షల మార్కు దాటిన భారత్!

by  |
పది లక్షల మార్కు దాటిన భారత్!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా పరీక్షల నిర్వహణలో భారతదేశం పది లక్షల మార్కు దాటినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఈ పరీక్షల్లో 39,980 మందికి పాజిటివ్ అని తేలింది. ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అగ్రదేశాల్లో పది లక్షల టెస్టులు పూర్తయినపుడు వారి పాజిటివ్ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

పది లక్షల కేసులు పూర్తయినపుడు అమెరికాలో 1,64,620 మంది, జర్మనీలో 73,522 మంది, స్పెయిన్‌లో 2,00,194 మంది, టర్కీలో 1,17,589 మంది, ఇటలీ 1,52,271 మంది పాజిటివ్‌గా తేలారు. సరైన సమయంలో లాక్‌డౌన్ విధించడం, ఆ లాక్‌డౌన్‌ని నిష్టగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఐసీఎంఆర్ వెల్లడించింది. మే 3వ తేదీ ఉదయం 8 గం.లకు 10లక్షల టెస్టు మార్కు దాటిందని, ఇంకా వివిధ రాష్ట్రాల్లో టెస్టులు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు.

Tags – corona, covid, test, 1 million, japan, america, USA, Italy, spain, india, statistics


Next Story

Most Viewed