IND vs NZ రెండో టెస్ట్: తడబడి నిలబడ్డ భారత్.. మొదటి రోజు స్కోరెంతంటే?

by  |
IND vs NZ రెండో టెస్ట్: తడబడి నిలబడ్డ భారత్.. మొదటి రోజు స్కోరెంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై వేదికగా భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్యులో మొదటి రోజు ఆటలో భారత జట్టు తడబడి నిలబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన భారత్ , ఓపెనింగ్ భాగస్వామ్యం 80 పరుగులతో శుభారంభం లభించినప్పటికీ , గిల్(44) పరుగులతో ఔటయ్యి పరవాలేదనిపించినా, తరువాత వచ్చిన పుజారా (0), కోహ్లీ (0) వెనువెంటనే ఔటయ్యి నిరాశపరిచారు. దీంతో 80 పరుగులకే 3 విలువైన వికెట్లు కోల్పోయి భారత్ ఒత్తిడిలోకి వెళ్లింది.

కానీ ఒక ఎండ్ నుండి మయాంక్ నిలకడగా ఆడుతూ , అయ్యర్ తో కలిసి 80 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకోల్పాడు. అయ్యర్ కూడా (18) పరుగులతో అవుట్ అవ్వడంతో తరువాత వచ్చిన సాహా తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు మయాంక్. ఈ క్రమంలోనే మయాంక్ 13 బౌండరీలు , 3 సిక్సర్ల సాయంతో సెంచరీ చేసి చేసాడు.
దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగు చేసింది. క్రీజులో మయాంక్ 120 పరుగులతో , సాహా 25 పరుగులతో అజేయంగా ఉన్నారు.


Next Story

Most Viewed