శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

by  |
శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం నాలుగో సోమవారం కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఉదయం నాలుగు గంటల నుంచే దర్శనాలు ప్రారంభం అయ్యాయి. కాగా స్వామి, అమ్మవార్ల లఘు దర్శనానికి మాత్రమే భక్తులకు అధికారులు అవకాశం ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ నాలుగు విడతలుగా ఆర్జిత అభిషేకాలు, రెండు విడతలుగా హోమాలు నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కరోనా నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.
Next Story

Most Viewed