మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : ముఖేష్ అంబానీ!

by  |
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : ముఖేష్ అంబానీ!
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ నిర్వహిస్తున్న ‘ఫ్యుయల్ ఫర్ ఇండియా-2020’ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సదస్సులో మొదటిరోజు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జకర్‌బర్గ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రసంగించారు. దేశంలో డిజిటల్ విభాగంలో ఉన్న అవకాశాలు, ఆర్థికవ్యవస్థ వృద్ధికి సాంకేతికత తోడ్పాటు వంటి పలు అంశాలను ఇరువురు ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రిలయన్స్ అధినేత ముఖేష్..రాబోయే ఇరవై ఏండ్లలో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా నిలవనుందని చెప్పారు.

అదేవిధంగా పౌరుల తలసరి ఆదాయం రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయంగా సుమారు 50 శాతంపైగా ఉన్నవి మధ్య తరగతి కుటుంబాలేనని, వీరి ఆదాయం ప్రతి ఏడాదికి 3 నుంచి 4 శాతం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫేస్‌బుక్ సహా వివిధ అంతర్జాతీయ కంపెనీలు, వ్యాపారవేత్తలు భారత ఆర్థికవ్యవస్థ వృద్ధిలో భాగస్వామి కావడం వల్ల రాబోయే దశాబ్దంలో సామాజిక మార్పులో భాగం కావడం మంచి అవకాశమని ముఖేష్ అంబానీ తెలిపారు.


Next Story

Most Viewed