చందుర్తిలో ఆలయ భూమి స్వాహా

by  |
Land-kabja1
X

దిశ, చందుర్తి: మండల గ్రామ శివారులో గట్టు వీరాంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వెళ్తుంటారు. అయితే, ఈ ఆలయానికి స్థానికి ఎమ్మెల్యే 2018లో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కేటాయించిన ఈ ఐదు ఎకరాల భూమి ఇప్పుడు కబ్జాకు గురైంది. ఈ విషయంపై గ్రామస్తులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ అండదండలతో కొందరు అక్రమార్కులు 5 ఎకరాల భూమిలో కొంతవరకు స్వాహా చేయగా మిగిలిన 2 ఎకరాల భూమిని కూడా ఇటీవల కొంతమంది కబ్జా చేసినట్లు ఇతర పార్టీ నాయకులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ స్పందించడంలేదు. ఇదంతా కూడా వీరి కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ విధంగా అక్రమార్కులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ భూములను కూడా పెద్ద ఎత్తున కబ్జా పెడుతున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇలాంటి వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

land-kabja-2



Next Story